కరోనాతో సమరంలో ప్రపంచం ఓడిపోయిందా? కరోనాపై ఎత్తిన కత్తిని అన్ని దేశాలు ఒక్కొక్కటిగా దించేస్తున్నాయా? కరోనాను కంటిచూపుతో చంపేస్తాం, ఆ వైరస్‌ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, కత్తికో కండగా నరికేస్తాం అని బీరాలు పలికిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వైరస్‌తో సహజీవనానికి సిద్ధమవుతున్నాయా? గిర్రున రోజులు తిరుగుతున్నా, క్యాలెండర్‌లో నెలల షీట్స్ సర్రున చిరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గని కరోనా కేసులు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి.. ప్రపంచానికి …
Read More »ఏపీలో కరోనా విజృంభణ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు …
Read More »తల్లి కుట్టిన మాస్క్ లను.. కొడుకు ఫ్రీగా పంచుతాడు..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమతమ పరిధుల్లో సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని తలంచిన ఢిల్లీకి చెందిన తల్లీకుమారుడు.. వారి పరిధిలోని పేదలకు మాస్కులు కుట్టి ఉచితంగా పంచిపెడుతున్నారు. నగరంలోని చిత్తరంజన్ పార్క్ సమీపంలో నివసించే వీరు.. కరోనా కారణంగా పేదలు పడుతున్న అవస్థలను నిత్యం చూస్తున్నారు. …
Read More »భారత్ లో 30,000 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది. 8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా …
Read More »తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం ఇదే
కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రం కరోనాను తరిమికొట్టడంలో విజయవంతంమవుతున్నాయి. త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి కోలుకున్న తర్వాత కరోనా కేసులు లేని రాష్ట్రంగా మారిందన్నారు. త్రిపురలో తొలుత రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి …
Read More »6 నెలల చిన్నారికి కరోనా
మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More »తెలంగాణలో ఒక్కరోజే 61కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.కేవలం ఒక్కరోజే అరవై ఒకటి కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 592కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 472మందికి చికిత్సను అందిస్తున్నారు.మొత్తం మీద103మంది డిశ్చార్జ్ అయ్యారు. పదిహేడు మంది కరోనా భారీన పడి మృత్యువాత పడ్డారు.ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 216కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.
Read More »ఏప్రిల్ 20వరకు కఠినంగా..మరి ఆ తర్వాత ఏమి జరుగుతుందంటే..?
ఏప్రిల్-20 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసి.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించి మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా సడలింపుపై మాట్లాడిన ఆయన.. ఏప్రిల్-20 తర్వాత ఒకవేళ కరోనా కేసు ఒక్కటి పెరిగినా అన్ని మినహాయింపులు తీసేస్తామని ప్రధాని …
Read More »ఏ దేశాల్లో ఎన్ని కరోనా కేసులు?
ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అమెరికాలో 12,841 మంది, స్పెయిన్‌లో 14,045, ఇటలీలో 17,127, ఫ్రాన్స్‌లో 10,328, జర్మనీలో 2,016, ఇరాన్‌లో 3,872, యూకేలో 6,159, టర్కీలో 725, స్విట్జర్లాండ్‌లో 821, బెల్జియంలో 2,035, నెదర్లాండ్స్‌లో 2,101 మంది మృతి చెందారు. యూఎస్‌ఏలో 4,00,335 పాజిటివ్ కేసులు, స్పెయిన్‌లో 1,41,942, ఇటలీలో 1,35,586, ఫ్రాన్స్‌లో 1,09,069, …
Read More »కరోనాతో ఉద్యోగాలకు ముప్పు
మాయదారి కరోనా అన్ని రకాలుగా మనుషుల ఉసురు తీస్తున్నది. వీలైతే బతుకును.. లేకపోతే బతుకుతెరువును మింగేస్తున్నది. కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో జన నష్టమే కాదూ.. ఆర్థిక నష్టమూ పెద్ద ఎత్తున వాటిల్లుతున్నది. ముఖ్యంగా భారత్‌కు కరోనా సెగ గట్టిగానే తగులుతున్నది. అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను ఈ మహమ్మారి ఏకంగా మాంద్యంలోకి పడేసింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్.. ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నా.. …
Read More »