దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.
Read More »తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం
ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేపుతోంది. ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వీరందర్నీ క్యాంపస్ లోని ఐసోలేషన్లో ఉంచారు. ఈ నెల మొదటి వారంలో 600 మంది విద్యార్థులు సొంత ఇళ్లకు వెళ్లడంతో కొందరు మాత్రమే క్యాంపస్లో ఉన్నారు.
Read More »మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »GHMCలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »తెలంగాణలో ఆ ధరలను తగ్గించాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.
Read More »హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,645 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,670,866 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు
Read More »కరోనా ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ ల మధ్య తేడా ఇదే..?
ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ తో మరణాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. సెకండ్ వేవ్ ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు, 3,059 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అప్పటికి 2% మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొంది. తాజాగా జనవరి 20న 3,17,532 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 72 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మరణాల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొంది.
Read More »