గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు గురువారం కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది …
Read More »మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 219 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా టెస్టులు చేశారు.. ఇందులో కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా.. తాజా కేసుల్లో 164 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 8,822 మందికి కరోనా వైరస్
భారత్ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా గడిచిన గత 24గంటల వ్యవధిలో 8,822 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే (6,594) పోలిస్తే ఈ రోజు 2,298 కేసులు పెరిగాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 …
Read More »కరోనాపై శుభవార్త
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
Read More »బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందారు.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.
Read More »దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ …
Read More »దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్‌తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి …
Read More »