సినిమా , టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్‌ఓపీలను ఖరారు చేసినట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, …
Read More »తెలంగాణలో 2,384 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం (22వ తేదీన) 2,384 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 755కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,851 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »కరోనాపై గుడ్ న్యూస్
టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి …
Read More »తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …
Read More »తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 99,391. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వరకు మృతి చెందిన వారి సంఖ్య 737 మంది.మొత్తం డిశ్చార్జ్ అయినవారు 76967 మంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,687 గా ఉంది.హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 15332 మంది.
Read More »తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …
Read More »భారత్‌లో ఒక్కరోజే 69వేల కేసులు
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల …
Read More »కరోనా నుండి కోలుకున్న సునీత
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్‌లోని మరో ఇద్దరు సింగర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయన …
Read More »మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »