కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
Read More »దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు. మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 11,904 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు …
Read More »తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు
తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,682కు చేరింది. ఇక నిన్న ఒకరు కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,611కు పెరిగింది. నిన్న 197 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 150 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. మొత్తం యాక్టివ్ …
Read More »కరోనా వ్యాక్సిన్ పై టర్కీ సంచలన నిర్ణయం
టర్కీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కరోనా వ్యాక్సిన్ డోసులకు.. తమ దేశంలో తలదాచుకుంటున్న ఉన్న వీగర్ ముస్లింలను డ్రాగన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా చెర నుంచి తప్పించుకున్న చాలామంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకుంటున్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి చైనా వీరందరినీ బందీలుగా చేస్తోంది. చైనా 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఈ నేపథ్యంలో వీగర్లు ఆందోళన చెందుతున్నారు
Read More »భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.
Read More »కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి ఎంతో తెలుసా..?
దేశంలో తయారవుతున్న కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి 6నెలలుగా ఉందని తయారీ కంపెనీలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 20లక్షల డోసులనే ఫ్రంట్లైన్ వారియర్లకు ఇచ్చారు. దీంతో మిగతా డోసులను వేగంగా ఇవ్వాలని సూచిస్తున్నాయి. అటు ఇప్పటికే రెండు కంపెనీలు 2కోట్ల చొప్పున వ్యాక్సిన్లను తయారు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. దీంతో వీటి వినియోగం కూడా జరగాల్సి ఉంది
Read More »తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,589కి చేరింది. ఇప్పటివరకు 2,88,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో 1,543 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
Read More »