తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.
Read More »దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,66,207 …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »చాహల్ కుటుంబంలో కరోనా కలవరం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »