దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »కరోనాపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్యశాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని …
Read More »దేశంలోఒకే రోజు ఏకంగా 1,17,100 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read More »ముంబైలో కరోనా విలయతాండవం
దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అక్కడ 20,181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి నలుగురు మరణించారు. ఈమేరకు ఎంబీసీ బులెటిన్ విడుదల చేసింది. అక్కడి స్లమ్ ఏరియా ధారావిలో 107 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ముంబైలో 79,260 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,339 కరోనా టెస్టులు చేయగా 547 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20,78,923కు చేరగా ఇప్పటివరకు 14,500 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Read More »రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోట్ కు కరోనా
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోట్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ సాయంత్రం కరోనా టెస్టు చేయించుకున్నాను. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇతర సమస్యలు ఏమి లేవు. నాతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి.అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి..అందరూ మాస్కులు ధరించాలని .’ అని ట్వీట్ …
Read More »మంచు లక్ష్మీకి కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా మహమ్మారి సెగ తగిలినట్లు ఉంది.సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఆ విషయం మరిచిపోకముందే మరో నటికి కరోనా సోకింది.మంచు కుటుంబానికి చెందిన మంచు లక్ష్మీకి కరోనా సోకినట్లు తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. గత రెండేండ్లుగా కరోనాకు దొరక్కుండా దాగుడుమూతలు ఆట ఆడుకున్నాను.కానీ ఈసారి మాత్రం కరోనా నన్ను దొరకబుచ్చుకుంది.నాకు స్వల్ప లక్షణాలే …
Read More »మహేష్ బాబు అభిమానులకు Bad News
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా కలవరం సృష్టిస్తుంది..ఇటీవల యువహీరో మంచు మనోజ్ కరోనా బారీన పడిన సంగతి మరిచిపోకముందే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో…ప్రిన్స్ మహేష్ బాబు కూడా కరోనా బారీన పడ్డారు. ఈ విషయం గురించి మహేష్ బాబు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు..నేను నిన్న కొవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటీవ్ అని తేలింది.స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికి ఇంట్లోనే వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1913 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,913 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా గత ఇరవై నాలుగంటల్లో కరోనా బారీన పడి ఇద్దరు మరణించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1,214 కేసులు ఒక్క రాజధానిమహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. నిన్న గురువారం కొత్తగా …
Read More »చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ ..?
ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.
Read More »