ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
Read More »వ్యాక్సిన్ తీస్కున్న అజాగ్రత్త వద్దు
దేశంలో, రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుంది. కొందరు తాము వ్యాక్సిన్ తీసుకున్నాములే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలను తప్పక పాటించండి. తుమ్మినా, దగ్గినా చేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోండి.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలో దేశంలో రాష్ట్రాల వారీగా కరోనా కేసులు నమోదు ఇలా ఉంది.. మహారాష్ట్ర – 41,327 కేసులు కర్ణాటక – 34,047 కేసులు తమిళనాడు – 23,975 కేసులు కేరళ – 18,123 కేసులు గుజరాత్ – 10,150 కేసులు హర్యాణా 9,000 కేసులు ఆంధ్రప్రదేశ్ – 4,570 కేసులు గోవా – 3,232 కేసులు …
Read More »ఏపీలో ప్రముఖులకు కరోనా
ఏపీలో ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.. మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
Read More »తెలంగాణలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్లు వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకితభావం వల్లే ఈ ఘనత సాధించామన్న ఆయన.. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిద్దామన్న హరీశ్.. 15-18 ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »కరోనా నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్కూళ్లను మూసివేసినా.. ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతించాలంది. కాగా హర్యానాలో ఇప్పటివరకు 15 లక్షల మంది విద్యార్థులు టీకా తీసుకున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »తెలంగాణలో 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా
ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.
Read More »