తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 207 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా నిన్న, ఇవాళ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Read More »నాదల్ కు కరోనా
స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.
Read More »మూడు డోసులు వేసుకున్నవారిని వదలని ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో కరోనా పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని, అయినా అతనికి వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు చెప్పారు. బాధితుడు …
Read More »దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,77,158 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. ఇంకా 84,565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 569 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 8706 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో …
Read More »ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ
ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను …
Read More »జీహెచ్‌ఎంసీ అప్రమత్తం-GHMC సర్కిళ్లలో ఐసొలేషన్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్ నమోదవుతున్న ప్రాంతాలు, …
Read More »తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 47 ఏళ్ల చెన్నై వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు UKలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఇప్పటికే 10వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
Read More »యూకేలో తీవ్రం రూపం దాల్చిన కరోనా మహమ్మారి
యూకేలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చింది. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 78,610 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,46,791కి చేరింది. ఇదిలా ఉండగా.. 10,017 ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశం …
Read More »గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ
ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.
Read More »