Home / Tag Archives: carona death rate (page 18)

Tag Archives: carona death rate

ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమ కి కరోనా పాజిటీవ్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు. ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా …

Read More »

చంద్రబాబుకు కరోనా పాజిటీవ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన తన అధికారక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక, మాజీ మంత్రుల్య్ దేవినేని ఉమ, నారా లోకేష్ నాయుడు లకు సైతం కరోనా …

Read More »

దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ

దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read More »

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు, దవా‌ఖా‌నల్లో వస‌తులు, ఆక్సిజన్‌, మందుల లభ్యత, వ్యాక్సి‌నే‌షన్‌ ప్రక్రియ, ఆసుపత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులపై మంత్రిమండలి చర్చించనున్నది. కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటా‌యిం‌పులు పూర్తయిన నేప‌థ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్‌ కేసులు, ఉద్యో‌గాల …

Read More »

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వంటి కారణాలతో కేసులు తగ్గినట్లు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో 3-4 రోజులు గమనించి.. కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు. గత నెల రోజుల్లో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో నిన్న 20,718 కరోనా కేసులు నమోదు కాగా.. …

Read More »

హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో కండక్టర్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కండక్టర్.. ప్రయాణికులు దిగాక డ్రైవర్ తో కలిసి టీ తాగారు. ఆ దగ్గర్లోనే ఉన్న కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం చూసి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలగా.. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

Read More »

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు.. నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి తెలిపారు.

Read More »

ఏపీలో  విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం

ఏపీలో  విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.

Read More »

వ్యాక్సిన్ తీస్కున్న అజాగ్రత్త వద్దు

దేశంలో, రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుంది. కొందరు తాము వ్యాక్సిన్ తీసుకున్నాములే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలను తప్పక పాటించండి. తుమ్మినా, దగ్గినా చేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోండి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat