కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »దేశంలో కొత్తగా 5,476 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,476 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 158మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 26,19,778 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »కరోనా ఏ జంతువు నుండి వచ్చిందో తెలుసా..?
చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.
Read More »దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »దేశంలో కొత్తగా 8,013 కరోనా కేసులు
దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 …
Read More »దేశంలో కొత్తగా 11,499 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,598 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,22,70,482 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,13,481 …
Read More »దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
Read More »దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …
Read More »