Home / Tag Archives: carona cases (page 85)

Tag Archives: carona cases

టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా ‌పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

Read More »

కర్ణాటక సీఎం కుమార్తెకు కరోనా

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా సోకిన సీఎం కుమార్తెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా సోకడంతో గత రెండు వారాలుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సీఎం అధికారిక నివాసంలోని ఉద్యోగులతోపాటు సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలింది.

Read More »

భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా…771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది …

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాకి కరోనా

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు  అమిత్ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్లో ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు

Read More »

తెలంగాణలో కరోనా కేసులెన్ని?

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …

Read More »

కరోనాతో యూపీ మంత్రి మృతి

కరోనా మహమ్మారికి సామాన్యులతో పాటు రాజకీయ నేతలు బలవుతున్నారు. తాజాగా యూపీ మంత్రి కమలా రాణి(62) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా బారిన పడటంతో గత నెల 18న చికిత్స కోసం లక్నోలోని రాజధాని కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. ఇటు మంత్రి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి రద్దు చేసుకున్నారు.

Read More »

అయోధ్యలో భూమిపూజ‌ పూజారికి కరోనా

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

Read More »

తెలంగాణలో కొత్తగా కొత్త‌గా 1811 క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వ‌తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కకు పెరిగారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేర‌కు రాష్ట్ర వైద్య‌ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు

తెలంగాణలో కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చ‌ల్‌లో 151, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 102 కేసులు నమోదయ్యాయి. క‌రీంన‌గ‌ర్‌లో 97, న‌ల్ల‌గొండ‌లో 61, నిజామాబాద్‌లో 44, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 41, మ‌హ‌బూబాబాద్‌లో 39, సూర్యాపేట‌లో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్ల‌లో 30, గ‌ద్వాల‌లో 28, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 27గా నమోదయ్యాయి. ఖ‌మ్మంలో 26, సిద్దిపేట‌లో 24, వ‌న‌ప‌ర్తిలో 23, జ‌న‌గామ‌లో 22, …

Read More »

తెలంగాణలో కరోనా కేసులెన్ని

28.07.2020న తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ?రాష్ట్రంలో న కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 58906 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 492 మంది ?డిశ్చార్జ్ అయినవారు 43751 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 14663

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat