తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1931 కరోనా కేసు లు నమోదు. 86475 కి చేరిన మొత్తం కరోనా కేస్ లు. 11 మంది మృతి 665 కి చేరిన మొత్తం మృతుల సంఖ్య. 1780 మంది డిశ్చార్జ్ 63074 మంది కోలుకున్నారు. 22736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 689150 టెస్ట్ లు నిర్వహణ జీహెచ్ఎంసీ లో 298 కేస్ లు, జగిత్యాల 52 …
Read More »కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన తొలిదేశం ఇదే…?
ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ మేరకు తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. టీకాను పరీక్షించిన వారిలో ఆయన కూమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని పుతిన్ తెలిపారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది. Source : EENADU
Read More »కరోనాపై ఏపీ ప్రజలకు శుభవార్త..
ఏపీ ప్రజలకు శుభవార్త కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డా. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 15శాతం పైనే హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తించినట్లు తెలిపారు.శనివారం నుంచి శీరోసర్విలెన్స్ భారీగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి …
Read More »విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు కరోనా రోగులు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కొవిడ్ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో …
Read More »మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటీవ్
మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం …
Read More »తెలంగాణలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య …
Read More »కరోనాపై మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ … ఎనాలసిస్
ఇంతటితో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం సరికాదు. WHO అభిప్రాయం లో కోవిడ్ -19 వైరస్ సోకిన వారిలో 3-4% మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కొన్నిదేశాలలోఈ శాతం కొంచెం ఎక్కువుగా ఉండవచ్చు.చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కొత్తగా పుట్టే జీవులు ఇంతకముందే వున్న జీవుల తగ్గుదల కు లేదా అంతానికి కారణం కావచ్చు. ఇది ప్రకృతిలో సాధారణం. మనుషుల వల్ల ఇప్పటికే చాలా జీవజాతులు అంతరించిపోయాయి. వైరల్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 18,708 యాక్టివ్ కేసులు ఉండగా, 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 563కు …
Read More »దేశంలో ఒకే రోజు 6.6లక్షల కరోనా టెస్టులు
గత 24 గంటల్లో కరోనా వైరస్ నిర్ధారణ కోసం 6.6లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ ఒకే రోజు అత్యధిక పరీక్షలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు …
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »