తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో …
Read More »దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. తాజా కేసులతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డవారి సంఖ్య …
Read More »ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 354 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టివరకు 8,80,430 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,69,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 3,861 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా 7,091 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో …
Read More »మహబూబాబాద్ లో 70 మందికి తీవ్ర అస్వస్థత
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »తెలంగాణలో తొలిదశలో 40,095 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు. PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు
Read More »తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు
తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,83,556గా ఉంది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,524కు చేరింది. నిన్న కరోనా నుంచి 384 మంది కోలుకున్నారు ఇప్పటివరకు 2,75,217 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జవగా ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »రకుల్‌ప్రీత్‌సింగ్ కి కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో తాను స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లాను. తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగుందని..తగినంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్స్‌కు హాజరవుతానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు …
Read More »దేశంలో కొత్తగా 23,950కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.
Read More »కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ
బ్రిటన్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. బ్రిటన్‌లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. …
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ …
Read More »