తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,635కు పెరిగింది. నిన్న వైరస్ బారి నుంచి 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్ కేసులున్నాయి..
Read More »Big Breaking News-25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నట్లు కన్పిస్తుంది. ఎక్కడ చూసిన కానీ కరోనా పాజీటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వార్తలను వింటున్నాం. తాజాగా ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బుర్లాలోని వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఎస్‌ఎస్‌యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. బాధిత విద్యార్థులంతా ఒకే హాస్టల్‌కు చెందిన వారని, వారిని చికిత్స కోసం బుర్లా వీర్ సురేంద్ర సాయి ఇస్టిట్యూట్ ఆఫ్ …
Read More »దేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది. గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారం
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది మార్చి 8 నుంచి కరోనా కేసుల సమాచారాన్ని అందజేస్తుండగా.. మంగళవారం నుంచి సమాచారాన్ని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు తెలిపారు. కొంత కాలంగా కరోనా ఉద్ధృతి తగ్గడం, కేసుల నమోదులో పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల అధికారులను టీకా కార్యక్రమంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారాన్ని విడుదల చేస్తామన్నారు.
Read More »దేశంలో కొత్తగా 10,584 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 10,584 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 13,255 మంది కొత్తగా డిశ్చార్జి అవగా.. 78 మంది మరణించారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. 1,07,12,665 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు …
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,712కు చేరింది. ఇందులో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,94,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోగా… మొత్తం 1,625 కరోనా మరణాలు సంభవించాయి
Read More »దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »మళ్లీ కరోనా గజగజ
హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …
Read More »కరీంనగర్ జిల్లాలో ఒకే ఊరిలో 33మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది, రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు… ఆయన అంత్యక్రియలు, కర్మకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్గుంపూర్ వాసులు వచ్చారు. వీరిలో కొందరికి లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా… 33నుందికి కరోనా వచ్చింది. దీంతో ఇవాళ కూడా గ్రామంలో కరోనా టెస్టులు చేయనున్నారు.
Read More »