దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక …
Read More »GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …
Read More »తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ …
Read More »వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, దీనికి తోడు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోగులు ఎక్కువ ఉన్న …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ …
Read More »టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అని స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్లాలనుకుంటే …
Read More »కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు. ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని …
Read More »దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More »