ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.
Read More »తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.
Read More »తెలంగాణలో 10వేల మార్కు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు …
Read More »దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. …
Read More »ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్-రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …
Read More »తెలంగాణలో కరోనా పంజా
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న ఒకే వైరస్ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం …
Read More »దేశంలో కరోనా మహోగ్రరూపం
దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 …
Read More »తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.
Read More »