మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »జలుబు త్వరగా తగ్గాలంటే..?
సొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి రోజూ 3 సార్లు తాగాలి -స్పూన్ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. అలాగే వెల్లుల్లిని నమిలి మింగడం వల్ల జలుబు తగ్గుతుంది వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జలుబు …
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 19 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277 కు చేరింది. మొత్తంగా 3,125 మంది మృతి చెందారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీ సంఖ్య 5,09,663 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తొలిసారిగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల దిగుమతి
• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశంలో తొలిసారిగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వ అవసరాలకోసం ఉచితంగా అందేంచేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ …
Read More »కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మవచ్చా..?
కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు…. ———————————————————— *ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి విశ్లేషణ* సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం… ఒక సైన్స్ విద్యార్థిగాకాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా… సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు.. ? ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద …
Read More »జాజికాయతో లాభాలెన్నో..?
జాజికాయలో ఆరోగ్య సుగుణాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జాజికాయ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది. వేడి పాలలో తేనె, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. జాజికాయలోని ఆయిల్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. దీన్ని తింటే జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జాజికాయ ఆయిల్ పంటి నొప్పిని తగ్గిస్తుంది. దీని కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది. …
Read More »థర్డ్ వేవ్ భయాంకరంగా ఉండబోతుందా..?
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే.. థర్డ్వేవ్ భయాలు వణికిస్తున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా అక్కడ చిన్నారులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మార్చి-మే నెలలను పోలిస్తే.. చిన్నారుల్లో 145% అధికంగా.. టీనేజ్ పిల్లల్లో 160% 3 3 అధికంగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2నెలల్లో ఇప్పటికే 15,000పైగా చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »