తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,979 శాంపిల్స్ను పరీక్షించగా.. 15,284 పాజిటివ్ కేసులు వచ్చాయి. 106 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,328 మంది మృతి చెందగా.. 14,00,754 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 సాంపిల్స్న టెస్ట్ చేశారు.
Read More »ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు
అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.
Read More »తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 23 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 నమోదయ్యాయి.
Read More »ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.
Read More »కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »