ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »GHMCలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా
తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ తోపాటు మరో 14 జిల్లాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.
Read More »ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.
Read More »అమెరికాలో 6కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
అమెరికాలో జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు 60 మిలియన్ల (6కోట్లు) మందికి పైగా కరోనా బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇందులో 8,37,594 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం, మరణాల్లో 15 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయని పేర్కొంది. నవంబర్ 9, 2020 నాటికి అమెరికాలో కోటి కేసులు రాగా జనవరి 1, 2021కి అవి 2 కోట్లకు …
Read More »దేశంలో కొత్తగా 1,79,723కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,79,723 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి (1.59 లక్షలు)తో పోలిస్తే కేసులు పెరగ్గా, మరణాలు 327 నుంచి 146కు తగ్గాయి. 46,569 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,23,619 ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 29,60,975 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఒమిక్రాన్ కేసులు 4033కు చేరాయి.
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,673 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నిన్న 2,606, మొన్న 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మరో 330 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ …
Read More »