ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు. ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని …
Read More »దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »