ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …
Read More »రికార్డుల రారాజు విరాట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.
Read More »