భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను …
Read More »TRS Mp నామా నాగేశ్వరరావు కుమారుడుపై దాడి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ..లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు కారులోకి ఎక్కారు. కత్తితో నామా కుమారుడిని బెదిరించి రూ.75వేలు ఎత్తుకెళ్లారు. దాడి ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read More »TRS MLA హత్యకు కుట్ర
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై కిల్లెడ సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయాలని హైదరాబాద్ మహనగరంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »లోక్‌సభలో గళమెత్తిన ఎంపీ నామా నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ధరల పెరుగుదల అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వంద శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ధరల పెరుగుదల వల్ల కామన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారన్నారు. గోధుమ, బియ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిందని, కానీ కానీ తెలంగాణలో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువులపై మరింత భారం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు …
Read More »టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నెల …
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. …
Read More »హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్‌సాగర్ (Osman Sagar) జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.ఇక హిమాయత్‌సాగర్‌కు 10 వేల …
Read More »రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ – మంత్రి నిరంజన్ రెడ్డి
దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్ …
Read More »TRS ఎంపీలపై సస్సెన్షన్ వేటు సిగ్గుచేటు-మంత్రి కేటీఆర్
పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ,ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల పై రాజ్యసభ నుంచి సస్సెన్షన్ వేటు సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు …
Read More »నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »