అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …
Read More »ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సమున్నత లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. అవినీతి రహిత, పారదర్శక సంక్షేమ పాలనే తమ సర్కారు లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వ ప్రాధామ్యాల మేరకు ఉన్నంతలో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి …
Read More »రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రభుత్వం కృషి చేస్తుంది..బుగ్గన
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని రాష్ట్రాన్ని విభజించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని లేకుండా విభజనకు గురైన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు …
Read More »మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ…‘ మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం. …
Read More »పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …
Read More »