తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఇటీవల సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ సభలో.. మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ….ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని ఉద్దేశించి కేసీఆర్ కి మించిన దొర ఎమ్మేల్యే సండ్ర అని వ్యంగంగా మాట్లాడటం, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని, ఇంటికి పంపడం ఖాయం అని అహంకార పూరితంగా మాట్లాడటాన్ని బిఅర్ఎస్ కల్లూరు మండల ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు తీవ్రంగా …
Read More »లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణలో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమముల పరుధిలోని ఎస్ఆర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. మరో రెండు …
Read More »మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోడీ నోరువిప్పాలి-ఎంపీ రవిచంద్ర
మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న,జరుగుతున్న నేరాలు,ఘోరాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర,అసహజ పరిస్థితుల పట్ల యావత్ దేశం విస్తుపోతున్నదని ఆవేదన చెందారు.మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,యువకులను …
Read More »తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం కష్టమా..?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశల పొంగుపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కష్టమేనంటూ ఆ పార్టీ వాస్తవ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 50 శాతానికిపైగా …
Read More »వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
నిన్న మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది. …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై వేటు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు అనర్హత వేటు వేసింది.. ఈ క్రమంలో తన సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న …
Read More »తెలంగాణ మహోన్నత కవి దాశరథి
తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష …
Read More »మరో 24గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర,ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
Read More »మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు
మణిపూర్ అంశంపై ఈరోజు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ ల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి. ఈరోజు శుక్రవారం కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశంపై చర్చకు మళ్లీ …
Read More »మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, నష్టం …
Read More »