వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ …
Read More »మొహర్రం ఏర్పాట్లపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ సమీక్ష
మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అన్నీ శాఖ అధికారుల సమన్వయంతో మొహరం వేడుకలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా …
Read More »వైద్యరంగం లో తెలంగాణ నెంబర్ వన్
దలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వైద్య రంగం లో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యరంగం లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. చిన్నచిన్న పరీక్షలకు సైతం పల్లె ప్రాంతాల నుండి పట్టణాల నుండి ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు …
Read More »మంత్రి ఎర్రబెల్లిని కలిసిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో పాలకుర్తి మండలానికి చెందిన 20 మంది యూత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అమెరికా పర్యటనకు త్వరలో వెళ్ళనున్న సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టిన రోజు (జులై 04) శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. అదేవిధంగా పాలకుర్తి మండల యూత్ కమిటీ గురించి కొద్దిసేపు మంత్రి తో మాట్లాడి …
Read More »”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం గారు. అనంతరం ఆయన భాషా, సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »గోదావరిలో నీటి లభ్యతపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలు, పరిస్థితులపై ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు.. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు…..
Read More »బతుకమ్మ చీరలకు 351.52 కోట్లు
బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం 351.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 18 ఏండ్లు నిండిన ప్రతి స్త్రీకి చీరలను పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సగటున ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా ఆడబిడ్డలకు లబ్ధి చేకూరుతున్నది. అందుకు సంబంధించి …
Read More »అడవి తల్లి మురిసింది..జోడేఘాట్ నవ్వింది
గోండులు నాగోబా జాతరకు తరలినట్టు.. కోయలు సమ్మక్క సారక్కలను కొలిచేందుకు మేడారం బారులు తీరినట్టు.. బంజారాలు తీజ్ పండుక్కు వెళ్లినట్టు.. గిరిపుత్రులు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇంటిల్లిపాది ఉత్సాహంగా తరలివచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న గిరిపుత్రులకు అటవీ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీని కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జి ల్లాలో పలు అభివృద్ధి …
Read More »తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు -కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని …
Read More »మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో చిక్కుకుని బస్సు లో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Read More »