జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More »అలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లే వస్తాయి
దేశంలో 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చన్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. కాంగ్రెస్ దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని.. ఇందుకోసం ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిహార్ లోని పూర్నియాలో …
Read More »రాజకీయాల నుండి సోనియా గాంధీ తప్పుకోవడం లేదా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత.. ఏఐసీసీ చీఫ్ శ్రీమతి సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోనియా గాంధీ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అయితే సోనియాగాంధీ అలా అనలేదని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే సంతోషంగా …
Read More »వచ్చేన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ కూటమి ప్రయత్నిస్తుందని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాక తొలిసారి మహాగర్ బంధన్ ర్యాలీని ఉద్దేశించి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.
Read More »దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …
Read More »మునుగోడు ఉప ఎన్నిక బరిలో BSP
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు R.S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారన్న …
Read More »