కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ …
Read More »శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో …
Read More »దేశానికే దారిచూపే టార్చ్ బేరర్‌గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో …
Read More »దుర్మార్గులు మళ్లీ వస్తే రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ : సీఎం కేసీఆర్
గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. …
Read More »నాడు చీకట్లు -నేడు వెలుగు జిలుగులు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్‌స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించనున్నారు. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో …
Read More »ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం
శ్రీశ్రీశ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది. సంఘం ప్రముఖులు సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో ఎంపీ రవిచంద్రను కలిసి ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రముఖులు …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్‌పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు
దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలోని మధుర రోడ్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …
Read More »దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ
యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్‌ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్‌సింగ్ ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్ స్టేషన్‌లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …
Read More »