కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నరోత్తంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నరోత్తం రెండుసార్లు టీడీపీ తరఫున …
Read More »గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ
దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ పొడు పట్టాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని బుగ్గపాడు, చెరుకుపల్లి, కాకర్లపల్లి, రేగళ్ళపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 1,196 మంది రైతులకు 1,649 ఎకరాలకు పోడు పట్టాలను గిరిజనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య …
Read More »వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం జిల్లాలోని శ్రీ కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. అంతకుముందు మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో మంత్రి …
Read More »హైదరాబాద్ మెట్రో సరికొత్త చరిత్ర
హైదరాబాద్ మెట్రో చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్కరోజే మెట్రోలో 5.10 లక్షల మంది ప్రయాణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో ప్రయాణించడం ఇదే తొలిసారి కాగా.. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీనగర్ నుంచి కూకట్ పల్లి రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణించారు. అమీర్ పేట్, ఉప్పల్, ఎల్బీనగర్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో.. ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణించారు.
Read More »దైవాంశ సంభూతుడు అల్లూరి: సీఎం కేసీఆర్
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతికి ఆయన నిలువెత్తు నిదర్శనమని శ్లాఘించారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »రూ.3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారక నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేస్-1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా రూ.3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం …
Read More »అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి 126వ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కి మంత్రి కేటీఆర్ అభినందనలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై మంత్రి శ్రీ కేటీఆర్ ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు హైదరాబాద్ లోని వారి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దూలపల్లి బ్రిడ్జి, ఫాక్స్ సాగర్ నాలా, కోల్ నాలా, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బీ అభివృద్ధి పనులు, లింకు రోడ్లు, కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసిలోని ఎనిమిది డివిజన్ లలో రోడ్లు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.ఎన్.డి.పి తదితర అభివృద్ధి పనులపై మంత్రి …
Read More »పోడు రైతు ఇంటికి రైతుబాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
అశ్వారావుపేట(నియోజకవర్గం), ములకలపల్లి(మండలం)లోని రాచన్నపేట(191) , ముత్యాలంపాడు(89), సితాయిగూడెం(320), జగన్నాథపురం(360), పాతగంగారం(135)లో 1095 గిరిజన పోడు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేసిన పోడు భూమి పాస్ పుస్తకాలను అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పంపిణీ చేశారు. ప్రతి ఒకరు ఎంతో ఆనందంగా వారి పాస్ పుస్తకాలు తీసుకుంటూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అడవి బిడ్డలకు …
Read More »