కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ తేదీ ఖరారు
తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »ఎంసెట్ పరీక్షలకు హాజరై విద్యార్థులకు శుభవార్త
తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.
Read More »సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26వేల పాఠశాలల్లోని 54,201 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే, కొత్త వేతనం అమలు ఎప్పటినుంచి అనేది …
Read More »మోదీ నాయకత్వంలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? – మంత్రి కేటీఆర్
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. ౩౦ ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే …
Read More »మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …
Read More »పేదింటి బిడ్డకి అండగా తెలంగాణ ప్రభుత్వం
బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి …
Read More »‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’
తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …
Read More »