18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో బూస్టర్‌కి పర్మిషన్ ఇవ్వండి: హరీశ్‌రావు
రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలోనూ కొవిడ్‌బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మన్‌సుఖ్ మాండవీయను హరీశ్‌రావు కోరారు. …
Read More »గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్ ధర ప్రైవేట్ హాస్పటల్స్‌లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో …
Read More »18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ప్రికాషన్ డోస్..
మనదేశంలోకి కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్ 10 ఈ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుని …
Read More »అమెరికాలో 6కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
అమెరికాలో జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు 60 మిలియన్ల (6కోట్లు) మందికి పైగా కరోనా బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇందులో 8,37,594 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం, మరణాల్లో 15 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయని పేర్కొంది. నవంబర్ 9, 2020 నాటికి అమెరికాలో కోటి కేసులు రాగా జనవరి 1, 2021కి అవి 2 కోట్లకు …
Read More »దేశంలో కొత్తగా 1,79,723కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,79,723 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి (1.59 లక్షలు)తో పోలిస్తే కేసులు పెరగ్గా, మరణాలు 327 నుంచి 146కు తగ్గాయి. 46,569 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,23,619 ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 29,60,975 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఒమిక్రాన్ కేసులు 4033కు చేరాయి.
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,673 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నిన్న 2,606, మొన్న 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మరో 330 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ …
Read More »GHMCలో కొత్తగా 1165 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 1165 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,54,287 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్ నేపథ్యంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »మహారాష్ట్రలో కరోనా భీభత్సం
మహారాష్ట్రలో గత 24గంటల్లో కొత్తగా 44,388 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 19,474 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మహమ్మారి వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 2.02లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »బండ్ల గణేష్ కు కరోనా
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదనితెలిపాడు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా గతంలో కూడా బండ్ల గణేష్కు కరోనా వచ్చి కోలుకున్నాడు.
Read More »