‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్ పాట పాడుకుంటున్నారు స్టార్ హీరో మహేష్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కళావతి..’ పాటను విడుదల చేశారు. కీర్తి సురేష్, మహేష్ బాబు జోడీ మీద చిత్రీకరించిన …
Read More »విలన్ గా నటించాలని ఉంది
ఏదైన సినిమాలో నచ్చిన కథ దొరికితే విలన్ గా నటించాలని ఉంది అని సీనియర్ నటి.. హాట్ హీరోయిన్ ప్రియమణి అంటున్నారు. విలన్ రోల్ విషయంలో ఆకలి తీరలేదు. విలన్ రోల్ షోషించాలని ఉందని చెప్పింది హీరోయిన్ ప్రియమణి. ‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీ ప్రయాణాలు కొంతే.. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరిన్ని వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాలనుంది’ అంది ప్రియమణి. తాజాగా ఆమె ప్రధాన …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి సాత్విక జై
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం …
Read More »‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?
విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …
Read More »మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్ అందాలు
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంతకాలం డీసెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇందుకు కారణం వరుస ఫ్లాపులతో కాస్త రేసులో వెనకబడుతుండటమేనని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా కీర్తి నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. ‘మహానటి’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎడాపెడా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు కమిటయ్యారు. …
Read More »హీరో విశాల్ కు గాయాలు
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్దారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాతో ఏ.వినోద్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో …
Read More »చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన …
Read More »రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ
‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.
Read More »ప్రభాస్ కోసం తెగ ట్రై చేస్తున్న F2 భామ
Pan India Hero ..యంగ్ రెబల్ స్టార్ .స్టార్ హీరో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కోసం యంగ్ హీరోయిన్ మెహ్రీన్ గట్టిగానే ట్రై చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుసగా క్రేజి ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్న ప్రభాస్ ..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం. …
Read More »