తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత ఆదివారం గోదావరిలో మునిగిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో 6 మృత దేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారంతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులో మొత్తం …
Read More »