దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది. ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.
Read More »భైంసాలో బ్లాక్ ఫంగస్ కలవరం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్క హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ ఫంగస్పై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ ఈ సమస్య రాదన్నారు.
Read More »