నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అనుక్షణం వెన్నంటే ఉండి పర్య వేక్షించిన బాలకృష్ణ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
Read More »బాబు,విజయసాయిరెడ్డి కలయికపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …
Read More »తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …
Read More »KTR: కేంద్ర భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్తిస్తూ ట్వీట్
KTR: కేంద్ర భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్తిస్తూ ట్వీట్ చేశారు. బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఉలిక్కి పడుతున్నారంటూ కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా కేంద్ర భాజపాకు లేదని మండిపడ్డారు. కానీ అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు బెదురుతున్నారో చెప్పాలని …
Read More »YCP: భాజపా వ్యాఖ్యలపై వైకాపా సీరియస్
YCP: భాజపా నేతల వ్యాఖ్యలపై వైకాపా నేతలు, మంత్రులు ఒకరితర్వాత ఒకరు ఘాటు వ్యాఖ్యాలతో సంధిస్తున్నారు. భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కన్నబాబు కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వంపైన ఒక్క భాజపాకేనా ప్రేముంది…మాకు లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చినప్పుడు రాని కోపం…ఇప్పుడు ఎందుకొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని మతాలను, ఆచారాలను …
Read More »గుండె పోటుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
Read More »komatireddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత
komatireddy: నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని……ఇక్కడకు రావడానికి 3 గంటలకు పైగా సమయం పట్టిందని భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే అక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు…..భారాస కార్యకర్తలకు …
Read More »Politics : రాజ్య సభ ప్రసంగాలని వీడియో తీసినందుకు కాంగ్రెస్ ఎంపీ సస్పెండ్..
Politics రాజ్య సభలో ప్రధాన మోడీ ప్రసంగించిన వీడియోలను రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రజిని అశోక్ రావు. అయితే ఇందుకు గాను ఆమెను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా …
Read More »Politics : సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం కుట్రను ముందుకు సాగనీయం.. కేటీఆర్..
Politics తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో వేషకు పడ్డారు సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం ఆలోచనను కచ్చితంగా భగ్నం చేస్తామని అన్నారు అందరం కలిసి ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణి కాపాడుకుంటామని అన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం కుట్రను తామంతా కలిసి ముందుకు సాగనీయమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు అలాగే సింగరేణి కార్మికులు అన్ని రాజకీయ నాయకులు …
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »