దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 13 వరకు అవకాశం కల్పించారు. 14న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 23న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత,దివంగత బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి పదవీకాలం ఈనెల 29న ముగియనుంది.
Read More »గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో విశాఖలో గత రెండ్రోజులుగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ MOUలతో కౌ13.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 6.32 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం అందిస్తాం. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు …
Read More »పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ ధన్యవాదాలు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. మూడేళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది. పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాం. GISలో 15 కీలక రంగాలపై ఫలవంతమైన చర్చలు …
Read More »Apకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సమ్మిట్ లో వచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ 100% అమల్లోకి వస్తాయని అన్నారు ఆర్కే రోజా. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో …
Read More »ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక ప్రకటన
ఏపీ రాజధాని నగరంపై ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని సీఎం జగన్మోహాన్ రెడ్డి మరోసారి వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన చేసిన సీఎం.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలోనే సాకారం కాబోతుందని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు.
Read More »రేషన్ కార్డు దారులందరికీ శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చేనెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందించబోతున్నాము..త్వరలోనే రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తాము.. వీటి …
Read More »తెలంగాణలో బీజేపీని ఓడించి తీరుతాం -ఓవైసీ
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …
Read More »