తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన నేత.. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగదీష్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేసీఆర్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. …
Read More »తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి
ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో అహంకారం, బలుపుతో ఓడిపోయామని అన్నారు. పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని.. వీర తిలకాలు దిద్ది పార్టీ నేతలను ఊరేగించారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులు ఒక్క ఛాన్స్ అని గెలిచారని పేర్కొన్నారు.
Read More »ఏపీ విద్యార్థులకు శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా కానుక. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు 3 జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి 23 నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు. 1-7 తరగతుల బాలురకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, నిక్కర్, 8-10కి హాఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ ప్యాంట్. …
Read More »బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు…
ఏపీ కి వరప్రదాయిని పోలవరం నిర్మాణంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. గత ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ …
Read More »టీబీజేపీ అధ్యక్షుడిగా సరికొత్త పేరు..?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి,మాజీ మంత్రి .. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవితోపాటు కీలక అధికారాలు అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయట. …
Read More »సింగరేణి కార్మికులకు దసరా కానుక
2014లో సింగరేణి టర్నోవర్ రూ.11,000 కోట్లు ఉంటే ఇప్పుడది రూ.33,000 కోట్లకు చేరుకుందని గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదే విధంగా లాభాలు రూ.300-400 కోట్లు మాత్రమే ఉంటే.. ఈ ఏడాది రూ.2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ.700 కోట్లుగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Read More »వైసీపీకి షాకిచ్చిన ఎమ్మెల్యే
ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్ లో నిన్న శుక్రవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించినప్పుడు టీడీపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ …
Read More »సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్ర 9 ఏండ్ల సంక్షేమ సుఖ తెలంగాణ 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఈరోజు బోథ్ నియోజకవర్గంలోని నూతన మండలమైన భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు …
Read More »సాంబాచారిని పరామర్శించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్, సూర్యాపేట రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాంబా చారిని శనివారం కాసరబాద్ గ్రామంలోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పిటిసి జీడి బిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, నాయకులు కొల్లు నరేష్, బంటు సైదులు, నాగరాజు, …
Read More »