నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా… శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ …
Read More »జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు
రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల …
Read More »భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.
Read More »దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Read More »సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?
లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.
Read More »BJP కి షాక్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నిష్క్రమిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. తాజాగా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, బీసీలు, మైనారిటీలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.
Read More »