ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రాలకు కోట్ల నిధులు కేటాయించామని ఆమె వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్రం రూ. 1618 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజాసేవ కోసం కేంద్ర, …
Read More »బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Read More »సోనియా గాంధీకి మరోకసారి ఈడీ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోకసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వ్యవహారంలో నగదు అక్రమ చలామణిపై విచారణ నిమిత్తం.. ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 8వ తేదీనే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడంతో మరో తేదీని కేటాయించాలని ఆమె EDని అభ్యర్థించారు. …
Read More »బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు రావడంతో ఇకచేసేదేమీ లేదన్నట్టు ఆ నేతలను సస్పెండ్ చేసిన కమలదళం.. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ విద్వేష రాజకీయాలను దేశంలోని …
Read More »భరతమాతకే అవమానం!
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలదించుకోవాల్సి వస్తున్నది.ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్ వైపు అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నాయి. కువైట్, దుబాయ్, ఖతార్, ఒమన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా తమ దేశాల్లో …
Read More »ఖతర్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం
ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అయిన అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ …
Read More »మధ్యప్రదేశ్ లోనే ఎక్కువగా శిశుమరణాలు
దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు. మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు …
Read More »ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు నిన్న శుక్రవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. ఈపీఎఫ్ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం …
Read More »కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు …
Read More »కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాలి
భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్మవారిని మొక్కుకున్నానని ఆయన చెప్పారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. దొంగలు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జల్సాలు …
Read More »