దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …
Read More »ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా
చైనా, ఇండియా సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద పొరుగు దేశం చైనా గ్రామాల ను నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. …
Read More »ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ …
Read More »రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు
కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల …
Read More »తెలంగాణలో బీజేపీని ఓడించి తీరుతాం -ఓవైసీ
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …
Read More »మరోసారి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరం అయిన వంట గ్యాస్ పై మళ్ళీ రూ.50 పెంచి సామాన్యుల నడ్డి వీరిచే కార్యక్రమాన్ని …
Read More »నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More »అలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లే వస్తాయి
దేశంలో 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చన్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. కాంగ్రెస్ దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని.. ఇందుకోసం ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిహార్ లోని పూర్నియాలో …
Read More »