సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… – పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి …
Read More »ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప‌్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More »భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు
Read More »బాబు అన్నంత పని చేసేశాడు
కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు
Read More »‘భోగి’ పండుగ అంటే ఏంటీ ?
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం …
Read More »అసలు భోగి పండుగ ఎలా వచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళ్తే ?
భోగి పండుగ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్నిపొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణాలు తెలియజేస్తున్నాయి.శ్రీమహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి …
Read More »భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉందట..ఏంటో తెలుసా ?
భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. భోగిమంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఈ …
Read More »భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉందట..అదేంటో తెలుసుకుందాం !
భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …
Read More »అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?
అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం …
Read More »తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …
Read More »