టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్నేశాడు. సౌతాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 22 ఇన్నింగ్స్లో 624 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో కోహ్లి 10 ఇన్నింగ్స్లో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాలో సచిన్ 1161 పరుగులతో టాప్లో …
Read More »‘అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది
ఒకప్పటి Team India బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సహృదయతను మరోసారి చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్ పోలీసును వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవల సచిన్ ఫ్రెండ్ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చాడు. దాంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. …
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More »పాకిస్తాన్ ఘనవిజయం
వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …
Read More »జెర్సీపై టేపుతో వచ్చిన పంత్…ఎందుకో తెలుసా..?
న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు. మిగతా జట్టు సభ్యులతో పోలిస్తే అతని జెర్సీ డిజైన్ కూడా వేరుగా ఉంది. అదేంటి? ఎందుకిలా ఉంది అని కొందరికి అనుమానం వచ్చింది కూడా. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఇట్టే పట్టేశారు. …
Read More »రోహిత్ Hit మ్యానే కాదు History Man
టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన రోహిత్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ …
Read More »హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?
టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.
Read More »రవిశాస్త్రి BCCI కి ప్రత్యేక ధన్యవాదాలు
టీమిండియా కోచ్ జట్టు విజయాల కోసం చేయాల్సినదంతా చేశానని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2014లో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తనను శ్రీనివాసన్ కోచ్ గా నియమించారన్నాడు.
Read More »నేడు స్కాట్లాండ్‌తో టీమిండియా మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నేడు స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 07:30 గంటలకు ప్రారంభం కానుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడ్డ టీమిండియా.. అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గి టోర్నీలో తొలి విజయం నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సాంకేతికంగా ఇంకా సజీవంగానే ఉన్నాయి. స్కాట్లాండ్, నమీబియా మ్యాచ్‌ల్లో భారీ విజయాలపై భారత్ కన్నేసింది. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలని …
Read More »