బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన కుటుంబంలో నలుగురికి పాజిటివ్ గా తేలింది. వీరిలో అతని కూతురు కూడా ఉంది. అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోం ఐసోలేషన్ లోనే ఉంచారు. గంగూలీ భార్య మాత్రం నెగటివ్ వచ్చింది. ఇప్పటికే గంగూలీకి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Read More »క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త
దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.
Read More »