ప్రముఖ హీరో ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్, హాజరవుతారు. పునీత్ …
Read More »అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!
ఫస్ట్ మూవీ అర్జున్‌రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది. లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్‌ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన …
Read More »పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు తీరనిది: విజయ్ దేవరకొండ
లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. బెంగుళూరు వెళ్లిన లైగర్ టీమ్ కంఠీరవ స్టేడియంలోని పునీత్ సమాధిని దర్శించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే తదితరులు ఉన్నారు. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబరులో గుండెపోటుతో మరణించారు.
Read More »హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం
సీనియర్‌హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »