తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకునేదే హోలీ అని, ఎవరికీ హాని కలగకుండా సహజ రంగులతో పండుగ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రజలకు హోలీ విషెస్ తెలియజేశారు. ఈ హోలీ అందరికీ ఆనందం, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Read More »సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు
Read More »