తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత …
Read More »‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకున్న బీజేపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా,ఈ నెల 10న తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8 నుంచి BJP తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 317తో అన్యాయం జరుగుతోందని, దానికి సవరణలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తొలుత బంద్ కి …
Read More »TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …
Read More »పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి.
రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడం లేదని బియ్యం …
Read More »బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …
Read More »మా ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ట్వీట్
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే …
Read More »నిరాశలో ఈటల రాజేందర్… అందుకేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరాశలో కృంగిపోతున్నారా…?. మొదట్లో తనలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గిపోతుందా..?. ఉప ఎన్నికల్లో గెలుపుపై తనకే నమ్మకం లేదా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందు ప్రస్తుతం తాను చేరిన బీజేపీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి కేంద్ర …
Read More »బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్‌కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …
Read More »TRSలో చేరిన BJP నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »సాగర్ లో ఎవరు ముందంజలో ఉన్నారు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు ఆదివారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నయి.ఉదయం నుండి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు. నోముల భగత్ కు తొలి రౌండ్లో 1,475 ఓట్లు, రెండో రౌండ్లో 2,216 ఓట్ల మెజార్టీ, మూడో రౌండ్లో …
Read More »