Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు
తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో …
Read More »ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్
మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్‌లో …
Read More »బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …
Read More »సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు: కేటీఆర్ సెటైర్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈడీ విచారణ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్నినడిపిస్తున్న డబుల్ ఇంజిన్ ‘మోడీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది …
Read More »బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ద్వారా కేటీఆర్ నోటీసుల పంపారు. కావాలనే బండి సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని.. ఇంటర్ విద్యార్థుల సూసైడ్ ఘటనలను కేటీఆర్‌కు ఆపాదిస్తున్నారని ఆయన తరఫు లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్‌కు సారీ చెప్పాలని.. లేకపోతే క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం ఇవ్వాల్సి …
Read More »బండి సంజయ్ అలాంటి ఆరోపణలు చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు: కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాస్యాస్పద, ఆధార రహిత, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్ చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ నిర్వాకమే కారణమంటూ సంజయ్ చేసిన కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. ఏమైనా ఆధారాలుంటే ప్రూవ్ చేయాలని.. వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సవాల్ విసిరారు. …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »