తెలంగాణ రాష్ట్ర బీజేపీలో వర్గపోరు ముదిరిపాకానపడుతున్నది. పార్టీపై పట్టు సాధించేందుకు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులాఉన్న ఆధిపత్యపోరు.. ఇప్పుడు బహిర్గతమైంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చేపడుతున్న యాత్రలే దీనిని రుజువుచేస్తున్నా యి. ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్రను చేపట్టగా.. బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ యాత్ర ముందే ప్రారంభం కావాల్సి …
Read More »సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More »కేంద్రం ఏమిచేసిందో బీజేపీ సన్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్
‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ …
Read More »బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీనే అని, తాను మతతత్వ వాదినేనని వ్యాఖ్యానించారు. 80% ఉన్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు. ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎందుకు ఓట్లు …
Read More »తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్
2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు
Read More »బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
Read More »బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …
Read More »బీజేపీ పై బాల్క సుమన్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్‌లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో …
Read More »మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్
హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు. ఇటీవల అమెజాన్ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ను మనం …
Read More »కలవరపెడుతున్న విజయశాంతి ట్వీట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది
Read More »