తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత …
Read More »TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »బీజేపీని వదిలిపెట్టం.. వెంటాడుతూనే ఉంటం – సీఎం కేసీఆర్
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం శ్రీ కేసీఆర్ గారు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను …
Read More »కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో బీజేపీ భస్మం
పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద …
Read More »తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు
తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …
Read More »తెలంగాణ BJP నేతలకు మంత్రి గంగుల వార్నింగ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.
Read More »ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా- సీఎం కేసీఆర్
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు.ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ పత్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు. కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే …
Read More »Huzurabad By Poll-ఓటమి భయంతో బీజేపీ కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న హుజూరాబాద్‌లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రచారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే …
Read More »అమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ BJP-Minister పువ్వాడ
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మార్గదర్శనం చేస్తున్న టీఆర్‌ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని వంటగ్యాస్, …
Read More »