స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »తెలంగాణ అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన మండలి చైర్మన్, స్పీకర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనతంరం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ నివాసం …
Read More »‘ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ …
Read More »తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ
భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ …
Read More »స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలి
అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …
Read More »కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్ అంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రాజభవన్, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గౌడ్స్ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం …
Read More »తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ” పాలమూరు నుంచి వలసలు లేవని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. వలసలు ఉన్నాయని నిరూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. దేవరకద్ర బహిరంగసభలో …
Read More »